TS : కేంద్రంలో కొత్త ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

2024లో మరికొద్దిరోజుల్లో కేంద్రంలో ఏర్పాటుకానున్న ప్రభుత్వంపై గులాబీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడిన కేసీఆర్.. ఎన్డీఏ కూటమికి 200 సీట్లకు మించి రావు అన్నారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే తాను ఏం చేస్తానన్నది అప్పుడే చెప్పలేనని చెప్పారు.
ప్రాంతీయ పార్టీలో కేంద్రాన్ని ఏర్పాటుచేయబోతున్నాయన్నారు కేసీఆర్. బిహార్, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, ఢిల్లీ లాంటి చోట్ల ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోందన్నారు. వచ్చే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రాంతీయ పార్టీలు నిర్ణయిస్తాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాత్ర లేకుండా కొత్త సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందనన్నారు కేసీఆర్.
ఇండియా కూటమి పెద్ద కూటమే కాదని.. ఎన్డీయే నుంచి పలు పార్టీలు వెళ్లిపోయాయని కేసీఆర్ అన్నారు. తాను థర్డ్ ఫ్రంట్‌కు రెడీ అని.. కూటమి ఏర్పాటుకు సారధ్యం వహించే ప్రయత్నం చేస్తా అన్నారు. ఎన్డీయేలో ఉంటే చంద్రబాబు కూడా నష్టపోతారని కేసీఆర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com