TS : బీజేపీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం : మల్లు రవి

కేసీఆర్ ది లిల్లిఫుట్ మనస్త త్వమని.. అందుకే తెలంగాణలో అధికారం పోయిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆకా శమంత గొప్ప మనసు ఉన్నవారు కాబట్టే ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ అహంకారం, అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని.. ఇప్పుడు కేసీఆర్ వెనుక ఎవరు లేరన్నారు.
నాయకులు, కార్యకర్తలంద రూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నారని మల్లు రవి వ్యాఖ్యానించారు. ఇంకా తన అహంకారవు మాటలతో ఉన్న పార్టీ కూడా ఉడ్చుకుపోయేట్టు చేస్కుంటున్నారని కేసీఆర్ పై మల్లురవి మండిపడ్డారు. బీజేపీ తో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
తన బిడ్డను జైల్లో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు బీజేపీకి సహ కరిస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలు సన్నారు. లిల్లిపుట్ మాటలు మాని ప్రజలకు ఎలాంటి మేలు చేయాలో ఆలోచించి మా ట్లాడాలని మాజీ సీఎంకు మల్లురవి హితవు పలికారు. అలా చేస్తే కనీసం పార్టీ ఉనికి అయినా ఉంటదని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com