TS : కవితను తప్పించేందుకు కేసీఆర్ ప్లాన్.. వాంగ్మూలంలో రాధాకిషన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కవితను కాపాడేందుకు కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కథను నడిపారని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయించి ఆ పార్టీని దారిలోకి తెచ్చుకుని.. ఈడీ కేసు నీరుగార్చేలా చేయాలనుకున్నారని తెలిపారు. నిందితులను అరెస్టు చేయవద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టు చెప్పడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించారు.
ఈ వ్యవహారాన్ని ట్రాప్ చేసేందుకు ఢిల్లీలో ఖరీదైన కెమెరాలు, మెటీరియల్ కొనిపించారని రాధాకిషన్ రావు తెలిపారు. వాటి ఆధారంగా రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ను ట్రాప్ చేశారని, వారిపై రకరకాల కేసులు నమోదు చేశారని తెలిపారు. అప్రూవర్లుగా మారి అమిత్ షా, తుషార్, బీఎల్ సంతోష్, నడ్డా పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలో నందకుమార్ పై మూడు రోజుల్లోనే 11 కేసులు నమోదయ్యాయి. బీఎల్ సంతోష్ పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చినా చెప్పకపోవడంతో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఫెయిల్ అయిందని తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com