Keshava Rao : రాజ్యసభ ఎంపీ పదవికి కేకే రాజీనామా.. నెక్స్ట్ ఏంటి..?

రాజ్యసభ సభ్యత్వానికి కే.కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు.
నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని తెలిపారు కేకే. కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కే.కేశవరావుని పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకుముందు కేశవ రావు.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి కీలక పదవిలో కొనసాగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు గొప్ప స్థానాన్ని కల్పించి, గులాబీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్‌బ్యూరోలో చేర్చుకున్నారు.
2014లో బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై మళ్లీ 2020లో రాజ్యసభకు వెళ్లారు. 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎక్కువమంది గులాబీ లీడర్లు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. దీంతో.. కాంగ్రెస్ బలం 70కి పెరిగింది. పద్ధతిగా పదవికి రాజీనామా చేరిన కేకేను కాంగ్రెస్ ఏ పదవితో గౌరవిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com