TS : కేసీఆర్ కీలక నిర్ణయం .. పార్టీ జనరల్ సెక్రటరీగా చారి!
బీఆర్ఎస్ (BRS) చీఫ్ కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు (కేకే) కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న క్రమంలో ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారిని నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకన్నట్లుగా తెలుస్తోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడంతోపాటు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కీలకంగా పని చేస్తున్నారు. మధుసూదనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం కేసీఆర్ తొలి కేబినేట్ లో తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నిమితులయ్యారు.
మార్చి 30వ తేదీన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో ఈ లోపే సెక్రటరీ జనరల్ కొత్త వారిని ఎంపిక చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com