TS : కాంగ్రెస్‌లో తెరుచుకున్న గేట్లు..

కాంగ్రెస్ గేట్లు తెరవడమే ఆలస్యం.. అక్కడ బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. బీఆర్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి కే. కేశవరావు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. సోనియా సమక్షంలో ఢిల్లీలో కేకే కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ నేత అరవింద్ రెడ్డి కూడా కేకేతో పాటే కాంగ్రెస్ లో చేరనున్నారు. సోమవారం ఈ చేరిక కార్యక్రమం ఉండే చాన్సుంది. శుక్రవారం సీఎం రేవంత్ ను కలిసిన కేకే.. తాను 55 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నానని.. తిరిగి సొంత ఇంటికి వస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమయ్యింది.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ ఉదయం కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో గద్వాల విజయలక్ష్మితో పాటు పది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని 150 వార్డుల్లో కేవలం మూడు వార్డుల్లోనే కాంగ్రెస్ గెలించింది. కార్పొరేటర్ల వలసతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలం పెరగనుంది.
అటు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణా పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com