TS : ఇవ్వాళ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం

తెలంగాణలోని17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైౖ నేతలకు కేసీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. అలాగే పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు, ఎన్నికల ఖర్చుకోసం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేయనున్నారు. అనంతరం ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించిన కేసీఆర్ రూట్ మ్యాప్‌పై నేతలతో చర్చించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని అభ్యర్థులకు, నాయకులకు కేసీఆర్ ఈ సమావేశంలో సూచించనున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com