TG : కేబినెట్ హోదాలో కేకేకు కీలక పదవి

TG : కేబినెట్ హోదాలో కేకేకు కీలక పదవి
X

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చెప్పారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ఢిల్లీ పర్యటలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని కేకే నివాసానికి వచ్చారు.

తన నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కేశవరావు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని సీఎం చెప్పారు.

ఎంపీ కె. కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేశవరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి సీసీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

Tags

Next Story