Khammam Market : ఖమ్మం మార్కెట్ కు ఒక్క రోజే 90 వేల బస్తాల మిర్చి

Khammam Market : ఖమ్మం మార్కెట్ కు ఒక్క రోజే 90 వేల బస్తాల మిర్చి
X

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఇవాళ తేజ రకం మిర్చి పోటెత్తింది. ఒక్కరోజులోనే సుమారు 90 వేల బస్తాలు రావటంతో యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. అర్ధరాత్రి నుంచే రైతులు తమ వాహనాల్లో మార్కెట్కు మిర్చిని తెచ్చారు. క్వింటా మిర్చికి గరిష్ఠ ధర రూ.14,050 జెండా పాటగా నిర్ణయించారు. మార్కెట్ కు భద్రత కల్పించాలని అదనపు పోలీసులు, హోంగార్డులు, మహిళా పోలీసులను నియమించాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యా పేట, ఏపీలోని పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రైతులు ఖమ్మం మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చిని తెస్తున్నారు. వారం రోజుల నుంచి పరిశీలిస్తే రోజుకు 90 వేల బస్తాల పైనే మిర్చి రావటం విశేషం. రానున్న రోజుల్లో నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది. -

Tags

Next Story