Medaram Jatara : మేడారానికి కిషన్ రెడ్డి.. సాయంత్రం కల్లా ఇతర ప్రముఖులు

మేడారం (Medaram) జన సంద్రమైంది. ఇసుకేస్తే రాలనంత జనం అమ్మలను చూసేందుకు వస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ (Sammakka Saralamma )మేడారం మహాజాతరకు (Jatara) కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) తరలిరానున్నారు.
ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కాచిగూడలోని తన నివాసం నుంచి బయలు దేరి 11.45 గంటలకు బేగంపేటలోని హెలిప్యాడ్ నుంచి మేడారం బయలు దేరనున్నారు.
ఫిబ్రవరి 22 గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలకు మేడారం చేరుకుని, 1.15 గంటలకు దర్శనానికి వెళతారు. ఆ తరువాత సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి 2.15 గంటలకు మేడారం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి 3.30 గంటలకు కుమ్రంభీం జిల్లాలోని సిర్పూరు కాగజ్ నగర్ కు చేరుకుంటారు. మరింతమంది వీఐపీలు కూడా మేడారం వెళ్లనున్నారు. పోలీసులు ఇందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com