TS : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కిషన్ రెడ్డి సన్నిహితుడు!

వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్, వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు తమ మద్దతు అభ్యర్థులను బరిలో దింపుతున్నాయి. కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికింది. శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది బీజేపీ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి తోడు మరొకరిని పట్టభద్రుల స్థానం నుంచి గెలిపించుకుని మండలికి పంపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు.
ప్రకాశ్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సైతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి తన పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి టికెట్ అంశంపై రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కిషన్ రెడ్డి కూడా ఆయనకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావడం కూడా ప్రకాశ్ రెడ్డికి కలిసొచ్చే అంశమని టాక్. గతేడాది హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ తో ఏవీఎన్‌రెడ్డి గెలిచి మండలిలో అడుగుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com