TS : ఏప్రిల్ 19న కిషన్ రెడ్డి నామినేషన్

TS : ఏప్రిల్ 19న కిషన్ రెడ్డి నామినేషన్

సార్వత్రిక ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్18న వెలువడనున్న నేపథ్యంలో ఈ నెల 19న సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ నుండి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డినే తొలి నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో కిషన్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

బస్తీ యాత్ర, జీపు యాత్రలతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. కాగా... కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 18న సాయంత్రమే రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకుంటారు. తన తెలంగాణ పర్యటనలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొనడంతోపాటు కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు.

అదేవిధంగా.. ఈనెల 21న తెలంగాణకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ నిర్వహించనున్న యాదవ సంఘాలతో ఆయన భేటీ అవుతారు.

Tags

Next Story