TG : సమస్యల పరిష్కారంపై కోదండరాం కీలక ప్రకటన

TG : సమస్యల పరిష్కారంపై కోదండరాం కీలక ప్రకటన
X

రాష్ట్ర ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం, జీ చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంలతో రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం ( టీ.జీ.వో.), రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ( టీ.ఎన్.జీ.వో ) అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. గెజిటెడ్ అధికారులు, టీ ఎన్ జీ వో లు ఎదుర్కొంటున్న సమస్యలను టీ. జీ. వో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీ ఎన్ జీ వో రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ త్రిసభ్య కమిటీ సభ్యులైన చిన్నారెడ్డి, కోదండరాంలకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాంలతో టీజీవో, టీఎన్ జీవో అధ్యక్షులు, ప్రతినిధుల భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం చేయాలని టీ జీ వో, టీ ఎన్ జీ వో ప్రతినిధులతో త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుంది అన్నారు చిన్నారెడ్డి, కోదండరాం. టీజీవో, టీ ఎన్ జీ వో ప్రతినిధులు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చిన్నారెడ్డి, కోదండరాం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తారని చిన్నారెడ్డి, కోదండరాం తెలిపారు.

Tags

Next Story