TS : కోల్‌కతా కోర్టు తీర్పు మమతకు చెంపపెట్టు.. స్వాగతించిన బూర నర్సయ్య గౌడ్

TS : కోల్‌కతా కోర్టు తీర్పు మమతకు చెంపపెట్టు.. స్వాగతించిన బూర నర్సయ్య గౌడ్
X

అంబేడ్కర్ మతాలకు అతీతంగా రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టారు. పదే పడే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అన్న రాహూల్ గాంధీ..మహమ్మద్ గజిని కూడా చెయ్యలేని దండయాత్రలు రిజర్వేషన్లపై చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసం రోహింగ్యాలకి ప్రభుత్వంలో, సైన్యంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని మమతా బెనర్జీ ఆలోచిస్తున్నారని అన్నారు బూరనర్సయ్య గౌడ్. 70 నుండి 75 శాతం హిందూ బీసీలను మమతా బెనర్జీ వెన్ను పోటీ పొడిచిందనీ.. హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగా రిజర్వేషన్లు మమతా ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. కలకత్తా కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

బెంగాల్ లో హిందువులు కూడా ఉద్యోగాలకోసం మతమార్పిడి చేసుకోవాల్సి వచ్చిందనీ.. హిందూ మతమార్పిడినీ మమత ప్రోత్సహించిందనీ.. హైకోర్టు తీర్పును పాటించనివాళ్లను సీఎం పదవిలో ఉండే అర్హత లేదన్నారు. మమతను వెంటనే తొలగించాలని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు బూర. బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని లెటర్ ఇచ్చారనీ.. మొదటి అసెంబ్లీ ఐపోయినా ఇంతవరకు అమలు చెయ్యలేదని బీఆర్ఎస్ పై ఫైరయ్యారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా స్థానిక ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు నర్సయ్య గౌడ్.

Tags

Next Story