TS : హైదరాబాద్ ను రోల్ మోడల్ గా మార్చుతాం : కోమటిరెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న పూర్తయ్యాయి. మే 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో సూపర్ గేమ్ ఛేంజర్ గా ఆర్ఆర్ఆర్ వచ్చిందన్నారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే సాధన కోసం కూడా గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నించానని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి.
హైదరాబాద్ నుంచి విజయవాడ ఒక ఎక్స్ ప్రెస్ హైవే పెట్టాలని.. ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు కోమటిరెడ్డి. అది మంజూరు అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎవ్వరూ ఫ్లైట్ ఎక్కరని తెలిపారు.
దేశంలో హైదరాబాద్ ను రోల్ మోడల్ సిటీగా మార్చుతామని అన్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాల్సినవి ఉన్నాయని వెల్లడించారు. ప్రజల కోసమే కాంగ్రెస్ పని చేస్తుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com