TG : కోకాపేట ప్రభుత్వ భూమిని తనఖా పెట్టడంపై కేటీఆర్ ఫైర్

రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూ ములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ. 10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్ ను పెట్టి వారికి రు.100 కోట్లు కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యో గాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎక రాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్క చూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలు ఎలా వస్తాయి" అని విమర్శించారు కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com