TS : కూలీ పనికి పద్మశ్రీ మొగులయ్యకు కేటీఆర్ సూపర్ ఆఫర్

TS : కూలీ పనికి పద్మశ్రీ మొగులయ్యకు కేటీఆర్ సూపర్ ఆఫర్

పాలమూరు కళాకారుడు, అరుదైన కిన్నెర వాయిద్య వాగ్గేయకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య కూలీ పనికి పోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారతో ఇసుక సిమెంట్ కలుపుతున్న వీడియోపై చాలామంది తమ సానుభూతి ప్రకటిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఈ పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు.

దినసరి కూలీగా మారిన మొగులయ్య.. తనకు ప్రభుత్వం అండగా ఉండాలని.. కుమారులు అనారోగ్యంతో బాధపడుతున్నారని అంటున్నాడు. నెలవారీ గౌరవ వేతనం రూ.10వేలు ఆగిపోయిందని.. పునరుద్ధరించాలని ప్రభుత్వాలను టీవీ ఛానల్ ద్వారా వేడుకుంటున్నారు భీమ్లానాయక్ లో పాటపాడిన మొగులయ్య.

మొగులయ్య పరిస్థితిపై కేటీఆర్‌ స్పందించారు. పద్మశ్రీ మొగులయ్య పరిస్థితి పై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రియాక్టయ్యారు. మొగులయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో.. కళాకారులను రేవంత్ రెడ్డి కూలీకి పంపుతున్నారని.. గతంలో రూ.కోటి ఇచ్చి ఆదుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలే మరోసారి మొగులయ్యను ఆదుకున్నారని గులాబీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story