TS : కవితను విడిపించే బాధ్యత తీసుకున్న కేటీఆర్!

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) నుంచి ఎలాగైనా బయటపడాలని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలు నుంచి బయటకు తెప్పించేందుకు ఆమె అన్న గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీనియర్ల లాయర్ల సాయంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈడీ తీరును నిరసిస్తూ… మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ వేయడానికి ముందు.. ఈడీ ఆరోపణలు, అభియోగాలు, సాక్ష్యాలు, కవిత పాత్రపై కేటీఆర్ లాయర్లతో సుదీర్ఘమైన కసరత్తు జరిపారు. కేటీఆర్ న్యాయపరమైన అంశాలపై నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కస్టడీలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్ ఒక్కరే కలిశారు.
ఆదివారం తొలిరోజు భర్త భర్త అనిల్, హరీశ్ రావులతో కలిసి కేటీఆర్ కవితను పరామర్శించారు. సోమవారం కేటీఆర్, హరీశ్‌రావులు వెళ్లగా… మంగళవారం మాత్రం కేటీఆర్ ఒక్కరే కలిసి మాట్లాడారు. కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తాను పది రోజుల వరకూ హాజరు కానని రిప్లై ఇచ్చారు. ఈ కారణంగా ఈడీ ఆఫీసుకూ రాలేకపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com