TS : ఏప్రిల్ 23న వరంగల్‌కు కేటీఆర్‌

TS : ఏప్రిల్ 23న వరంగల్‌కు కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏప్రిల్ 23న వరంగల్‌ పర్యటనకు రానున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి మారపెల్లి సుధీర్‌కుమార్‌ ప్రచార కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరుకానున్నారు. 23న సాయంత్రం 4గంటలకు వర్ధన్నపేటలో జరిగే సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్‌.. సాయంత్ర 6గంటలకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సుధీర్‌కుమార్‌ 22న ఉదయం 10గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

అలాగే ఏడు నియోజకవర్గాల వారిగా ప్రచార సమావేశాలను పార్టీ ప్రకటించింది. 19న వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ సమావేశం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఉదయం 10గంటలకు జరగనుంది. 20న ఉదయం 10గంటలకు భూపాలపల్లి నియోజకవర్గ సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తారు. 20న మధ్యాహ్నం 2గంటలకు పరకాల నియోజకవర్గ సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని లలితా కన్వెన్షన్‌లో జరుగుతుంది.

23న సాయంత్రం 4గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గ సమావేశం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతుంది. 23న సాయంత్రం 6గంటలకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గ సమావేశం వరంగల్‌లో నిర్వహించనున్నారు. 25న ఉదయం 10గంటలకు పాలకుర్తి నియోజకవర్గ సమావేశం రామ ఉపేందర్‌ గార్డెన్స్‌ తొర్రూరులో నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story