TS : ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

TS : ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం
X

ఎంపీ ఎన్నికల హడావిడి ముగియడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపు వ్యూహాల రచన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యనేతలతో నేడు సమావేశం కానున్నారు. మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

త్వరలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తాజాగా సమీక్ష నిర్వహించారు. 3 ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అందరూ క్షేత్రస్థాయిలో కష్టపడాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేయాలని సూచించారని వెల్లడించాయి.

Tags

Next Story