TS : పవర్‌లో బీఆర్ఎస్ లేదనేందుకు ఇవే సాక్ష్యం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్‌

TS : పవర్‌లో బీఆర్ఎస్ లేదనేందుకు ఇవే సాక్ష్యం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్‌

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. అంతేకాకుండా సెటైరికల్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. "నేను చెప్పబోయే ఆ ఆరు వస్తువులను గ్యారెంటీగా మీరు మీతో ఉంచుకోవాలి లేదంటే ఇబ్బంది పడతారని" ఈ కింది వస్తువులను పేర్కొన్నారు.

- ఇన్వర్టర్

- ఛార్జింగ్ బల్బులు

- టార్చ్ లైట్లు

- కొవ్వొత్తులు

- జనరేటర్లు

- పవర్ బ్యాంకులు

ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుంచుకోండి.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని గుర్తుచేశారు. అంతేకాకుండా మే 13వ తేదీన జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ ట్వీట్‌పై పాజిటివ్‌, నెగిటివ్ కామెంట్స్ వస్తుండటం విశేషం.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పవర్ కట్స్ పెరిగాయన్న కేటీఆర్ సెటైర్స్ పై సీఎం ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Tags

Next Story