TS : హనుమాన్ జయంతి.. ఇవ్వాళ మద్యం షాపులు బంద్

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం(23న) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని మద్యం షాపులు, బార్లు, క్లబ్బులను మూసి ఉంచాలని ఎక్సైజ్, పోలీసుశాఖల అధికారులు ప్రకటించారు. ఎక్కడా మద్యాన్ని విక్రయించే ప్రయత్నాలు చేయొద్దని షాపుల యజమానులను హెచ్చరించారు. కాగా, ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా మద్యం షాపులు, బార్లను మూసేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆరు రోజుల తర్వాత ఇప్పుడు మద్యం షాపులు మూసి ఉంచాల్సి రావడం మందుబాబులకు కాస్త ఇబ్బందికరమే.
హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విజయయాత్ర మంగళవారం ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది.
హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు. హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3 గంటల 25నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 5 గంటల 18నిమిషాలకు ముగుస్తుంది. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని, ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com