TG : జూలై 15 నుంచి రుణమాఫీ?

ఆగస్టు 15లోగా ₹2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. జులై 15 నుంచి ₹50వేల లోపు, ఆ తర్వాత ₹75వేలు, ₹లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి ₹లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి AUG 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట.
రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో ₹30వేల కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్‌ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో ₹8,246 కోట్లు సేకరించగా, మరో ₹2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకోనుంది. ఈ ఏడాది కోటాలో మరో ₹30వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com