TS : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి

మహబూబ్ నగర్ (Mahabub Nagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి ఎన్ నవీన్ కుమార్ రెడ్డి (Navin Kumar Reddy) పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఎన్ నవీన్ కుమార్ రెడ్డి పూర్తి పేరు నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి. ఈయన స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
గతంలో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11వ తేదీ నాటికి నామినేషన్లకు చివరి తేదీ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com