TS : లోక్ సభ తెలంగాణ ఆవాజ్ ఇదే.. ఎవరికి ఎన్ని సీట్లుంటే..?

'తెలంగాణ ఆవాజ్' సంస్థ వీక్లీ సర్వే రిపోర్ట్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన 'తెలంగాణ ఆవాజ్' టీమ్.. ప్రజల ఓపీనియన్‌ను కూడగట్టి ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 29.8 శాతం, బీజేపీకి 28.6 శాతం, బీఆర్ఎస్‌కు 24.3 శాతం, తటస్థులకు 12.3 శాతం, ఇతరులకు 4.9 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక అంచనా వేసింది.
కాంగ్రెస్‌కు 6 నుంచి 8 లోక్‌సభ సీట్లు, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు, బీఆర్ఎస్‌కు 2 నుంచి 4 సీట్లు, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక తేల్చింది. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలకు ఈ సర్వే షాక్ ఇచ్చేలా ఉంది. ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. ఇటీవల 'సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి' నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలోని ఓటర్లు రామమందిరం అంశానికి 8శాతం ప్రాధాన్యత ఉన్నట్టు సర్వేలో తెలిపారు. చదువుకున్న యువతీ యువకులలో చాలామంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా, అంతగా చదువుకోని వ్యక్తులు ధరల పెరుగుదలను ముఖ్యమైన అంశమని తెలిపారు. ఎవరి సర్వే నిజం అవుతుందో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com