Telangana : ప్రేమజంట ఆత్మహత్య

Telangana : ప్రేమజంట ఆత్మహత్య
X

ప్రేమ కోసం చంపడానికైనా.. చావడానికైనా సిద్ధపడుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవన్మ మరణాలకు పాల్పడుతూ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. తాజాగా ప్రేమ జంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ (మ) కొండమడుగులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మ హత్యకు పాల్పడిందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులది హైదరాబాద్ లోని రామంతాపూర్ గుర్తించారు. ప్రేమ జంట ఆత్మహత్యపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Tags

Next Story