TS : లక్నవరం తీగల వంతెన బంద్

TS : లక్నవరం తీగల వంతెన బంద్
X

తెలంగాణ (telangana) వాసుల కొంగు బంగారమైన మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం (Laknavaram) సందర్శన నిలిపివేశారు అధికారులు. ఇవాళ్టి నుంచి నుంచి ఫిబ్రవరి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు, పోలీసులు తెలిపారు. మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ఎక్కువైతే బ్రిడ్జిపై అనూహ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. పర్యాటకులు సహకరించాలని పోలీసులు కోరారు.

మేడారం మహాజాతర (Medaram Jatara) కోసం ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారం ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమలవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపా

Tags

Next Story