TS : మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదా

TS : మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదా

మహబూబ్‌నగర్ (Mahbubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. ఇవాళ కౌంటింగ్ జరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.

మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. మహబూబ్​నగర్ బాలుర జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లో బ్యాలెట్ బాక్సులు అధికారులు భద్రపర్చారు.

రిజల్ట్ వాయిదా పడడంతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఈ ఉప ఎన్నికలను అధికార కాగ్రెస్​తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఈ ఉపఎన్నిక జరుగుతుండటంతో ఎలాగైన పట్టు సాధించేందుకు రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story