TS : ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మి స్కీం

కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) లేడీస్ కు పట్టిందల్లా బంగారమే అవుతోంది. లేడీస్ ఓట్లతో అధికారంలోకి వచ్చామని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మరింత సంక్షేమాన్ని అందుబాటులోకి తెస్తోంది. కొత్త స్కీమ్ లలో లేడీస్ కే ప్రయారిటీ ఇస్తోంది.
హైదరాబాద్‌లో (Hyderabad) ఎలక్ట్రిక్ బస్సులు మార్చి 12 మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనతో.. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నాన్ ఏసి ఎలక్ట్రిక్ బస్సులు.
ఆగస్ట్ నుంచి వచ్చే అద్దె బస్సుల్లోనూ లేడీస్ కు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దె ప్రాతిపదికన తీసుకోనున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి. 22 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన TSRTC.. అద్దె బస్సుల్లోనూ మహాలక్ష్మి స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com