TS : కవిత అరెస్ట్‌పై నోరు మెదపని మజ్లిస్

TS : కవిత అరెస్ట్‌పై నోరు మెదపని మజ్లిస్

గడిచిన పదేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో కలిసి నడిచారు మజ్లిస్ నేతలు. ముస్లిం ఓటర్లు ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఓటేయాలని రెండు పర్యాయాలు అసదుద్దీన్ ఓపెన్‌గా ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోవడం.. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడం వంటి పరిణామాలతో గులాబీ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

బీజేపీ అంటే మండిపడిపోయే అసదుద్దీన్ ఒవైసీ కానీ, మరో ఎంఐఎం ముఖ్య నేత అక్బరుద్దీన్ కానీ కవిత అరెస్ట్‌పై స్పందించకపోవడం పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత అరెస్ట్‌ను యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు. బీఆర్ఎస్‌తో పదేళ్లు ఫ్రెండ్లీ ఉన్న ఎంఐఎం స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు మజ్లిస్ నేతలు కాంగ్రెస్ తో స్నేహంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతూ విచారణకు ఆదేశిస్తున్న రేవంత్ సర్కారుతో వైరం ఎందుకులే అనే భావనలో ఉన్నారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి.. మాజీ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్‌పై స్పందించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారట. అసదుద్దీన్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ఈ మధ్య ఆచితూచి వ్యవరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story