Canara Bank : కెనరా బ్యాంక్ లో రూ.1.3 కోట్ల చీటింగ్

హైదరాబాద్ (Hyderabad), ఆంధ్రప్రభ : మిషన్ భగీరథ పథకంలో పనులు చేపట్టినట్లు నమ్మించి కెనరా బ్యాంకు నుంచి రూ. 1.3 కోట్లు కొట్టేసిన కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన మహ్మద్ ఫయాజ్, మహ్మద్ చాంద్ పాషా ఇద్దరూ కలిసి ఏఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం తీసుకోవాలనుకున్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు తీసుకున్నట్లు, ఆ పని పూర్తిచేసినట్లు బాలానగర్ లోని కెనరా బ్యాంకులో 2018-2021లో నకిలీ పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, ప్రాజెక్టు వివరాలు సమర్పించారు.
అయితే 2021లో కెనరా బ్యాంకు (Canara Bank) మేనేజర్ శ్రీనివాస బాబు నిందితులకు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నింది తులు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని తెలిసినా రూ.1.3 కోట్ల లోను మం జూరు చేశారు. కాగా కెనరా బ్యాంకు అధికారులు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన తనికీ (అడిట్)లో ఈ మోసం బయటపడింది. దీంతో బ్యాంక్ సిబ్బంది నిందితులు లోన్ నిమిత్తం సమర్పించిన పత్రాలలో పేర్కొన్న చిరు నామాలను గుర్తించారు. ఇందులో భాగంగా రామం తాపూర్ ప్రగతినగర్ లోని అడ్రస్కు వెళ్లగా అక్కడ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కార్యాల యం లేకపోవడంతో ఈ వ్యవహారంపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ కేసులో నిందితులతో చేతులు కలిపిన శ్రీనివాసబాబు విచారిం చి ఫిబ్రవరి 20న అరెస్ట్ చేశారు. ఈకేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఫయా జ్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని ఇదే కేసులో మరో నిందితుడు మహ్మద్ చాంద్ పాషా పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com