TS : మల్లారెడ్డికి మళ్లీ షాక్.. కాలేజీ అక్రమ భవనాల కూల్చివేత

TS : మల్లారెడ్డికి మళ్లీ షాక్.. కాలేజీ అక్రమ భవనాల కూల్చివేత

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కారు దూకుడు మీదుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత మల్లారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చి వేసింది. ఇప్పుడు మరోసారి మరోచోట కూల్చివేతలకు దిగింది.

మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చి వేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భారీగా కూల్చివేత పనులు చేపట్టారు. నగర శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌) ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు ఏడు రోజుల కిందట యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దుండిగల్ పరిధిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కాలేజీ సిబ్బంది వచ్చినా వారికి సర్ది చెప్పారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story