TS : కాంగ్రెస్‌లో మా కోవర్టులు ఉన్నారు: మల్లారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ కోవర్టులంతా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. ‘చాలామంది కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్‌లోకి పంపా. వారు కాంగ్రెస్ కండువా కప్పుకుని బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. వారే ఇప్పుడు కాంగ్రెస్ కొంప ముంచనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారంతా తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారు’ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కార్పొరేటర్లతో చెప్పానని అన్నారు. అయితే తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారని మల్లారెడ్డి అన్నారు. హస్తం పార్టీలోని సీనియర్ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ప్రతి రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు, మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను మల్కాజిగిరి బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా సమర్ధించడం గమనార్హం. దీంతో ఈ వీడియో కాస్త సోషల్మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇక, మల్లారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com