Manager Arrested for Harassment : ఉద్యోగానికి వస్తే అత్యాచారం చేశాడు.. మేనేజర్ అరెస్ట్

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగానికి వచ్చిన యువతిపై ఓ దుర్మార్గుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్లగా.. ఆ మేనేజర్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ లోని మధురా నగర్ లో సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం కోసం ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత ఆ యువతికి కాల్ చేసి కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూకి పిలిచింది. దీంతో ఆ యువతి మధురా నగర్లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం హాజరైంది. అనంతరం మేనేజర్ నవీన్ కుమార్ ఆమెను ఇంటర్వ్యూ తీసుకున్నాడు.
మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని.. కంపెనీ తరపున ఆఫీస్ సిమ్ కార్డ్ ఇస్తామని చెప్పాడు. తన వద్ద ప్రస్తుతం సిమ్ కార్డు లేదని.. రేపు ఇంటికి రావాలని మేనేజర్ చెప్పాడు. మేనేజర్ ఇంటికి యువతి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే తలుపు వేసి.. యువతిపై మేనేజర్ అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. యువతి కేకలు వేయడంతో చంపుతానని బెదిరించాడని.. అక్కడి నుంచి తాను తప్పించుకున్నానని యువతి తెలిపింది. పోలీసులు నిందితుడైన మేనేజర్ నవీన్ ను అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com