Holiday : మే 14న వారికి సెలవు

Holiday : మే 14న వారికి సెలవు

మే 13న ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సిబ్బందికి మే 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పెయిడ్ హాలిడేగా గుర్తించాలని సీఈసీ వికాస్ రాజ్ (CEC Vikas Raj) అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పోలింగ్ రోజున సెలవులు ఇచ్చారు. కాగా, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి మరుసటి రోజు అంటే మే 14న సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సిబ్బందికి మే 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పెయిడ్ హాలీడేగా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. దీంతో వరుసగా రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story