TG : సమస్యలను వెంటనే పరిష్కరించండి.. అధికారులను మేయర్ ఆదేశం

TG : సమస్యలను వెంటనే పరిష్కరించండి.. అధికారులను మేయర్ ఆదేశం
X

సఫిల్ గూడ లేక్ పార్కు లో గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి కమిషనర్ ఆమ్రపాలి కాట తో కలిసి సఫీల్ గూడ లేక్ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ,శ్రావణ్ కాలని వాసుల్లు వేకర్స్ పలు సమస్యలను మేయర్ కు వివరించారు. సాఫిల్ గూడ చెరువులో గుర్రపు డెక్క తో మురుగు నీరు కలుస్తున్నాందున దోమలు విపరీతంగా ఉన్నాయని వివరించారు మురుగు నీరు రాకుండా వాటర్ వర్క్ అధికారులతో మాట్లాడి డైవర్షన్ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అదే విధంగా పూర్తిగా గుర్రపు డేక్క తొలగించిన తర్వాత టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని అవసరమనుకుంటే బోటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ మేయర్ వివరించారు.పార్కుల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసారు అవి కొన్ని మరమ్మత్తులు చ్చేయాలని వాకార్స్ వివరించడం తో 15 రోజుల్లో మరమ్మతులు చేయాలని అంటే కాకుండా ఓపెన్ జిమ్ వద్ద వర్షాలు కురిసినప్పుడు బురదగా ఉంటుందనీ అక్కడ కూడా బురద లేకుండా మొరం పోయాలని అధికారులను ఆదేశించారు చెరువు కట్ట పైన పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు తదనంతరం దీన్ దయాళ్ కాలని లో నాలా ను పరిశీలించారు నాల లో ప్రమాదాలు సంభవించ కుండా భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులను వారు ఆదేశించారు మేయర్, కమిషనర్ వెంట సికింద్రాబాద్ జోనల్ కమీషనర్ రవి కిరణ్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story