Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్ల భేటీ

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్ల భేటీ
X

కరీంనగర్ లో బీజేపీ జోరు కనిపిస్తోంది. భారీ చేరికలకు టైం వచ్చిందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు కార్పొరేటర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ( Bandi Sanjay ) కలిశారు. పూలమాల వేసి శాలువాతో సన్మానం చేశారు. బండి సంజయ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు.

కార్పొరేటర్ స్థాయి నుండి బండి సంజయ్ అంచెలంచలుగా ఎదిగి కేంద్ర మంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. రాంపూర్ లో కలుషిత వాతావరణం సృష్టిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలని ఐండి సంజయ్ ను కోరినట్లు చెప్పారు.

కిసాన్ నగర్ లో ఉన్న దేవాలయాలను సందర్శించాలని కార్పొరేటర్లు సంజయ్ ను కోరారు. జ్యోతినగర్, కోతిరాంపూర్, కిసాన్ నగర్, విద్యానగర్ కార్పొరేటర్లు గందే మహేశ్, ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, కచ్చు రవి తదితరులు బండి సంజయ్ ను కలిశారు.

Tags

Next Story