TS : సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ

ఖైరతాబాద్ (Khairatabad) బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయ్యారు. మార్చి 15వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమైన చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తోంది. కానీ సీఎంతో తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని దానం అంటున్నారు. ఖైరతాబాద్ నుంచి దానం ఎమ్మెల్యేగా ఉన్నారు.
దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగారు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుండి పోటీచేసి చింతల రామచంద్ర రెడ్డిపై ఓడిపోయాడు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి చింతల రామచంద్ర రెడ్డిపై గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com