AP : కోమటిరెడ్డితో ఎంపీ విజేత చామల భేటీ

AP : కోమటిరెడ్డితో ఎంపీ విజేత చామల భేటీ

భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బంపర్ మెజార్టీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని నివాసంలో కలిసారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.

గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీగా గెలిచి తన నివాసానికి వచ్చిన చామలను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారం, ఓటింగ్, ఎక్కెడెక్కడ ఎంత మెజర్టీ వచ్చిందో చర్చించుకున్నారు. అనుకున్న విజయాన్ని సాధించడంతో భువనగిరి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యనేతలంతా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది.

Tags

Next Story