TS : రేవంత్‌తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌పై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తుటాలు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి ఆయనను కలిశారు.
బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రామారావ్ పటేల్ సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వరికి క్వింటాలుకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని సీఎంను కోరారు.
వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని వినతిపత్రం అందించారు. అలాగే రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com