Microsoft Data Center : హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

Microsoft Data Center : హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కు వేదిక కాబోతోంది. రంగారెడ్డి జిల్లాలో రూ.267 కోట్లతో 48 ఎకరాలను దిగ్గజ సంస్థ కొనుగోలు చేసింది. హైదరాబాద్ సిగలో మరో కలికి తురాయి చేరబోతోందని ఐటీ వర్గాలు ప్రకటించాయి.

ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసా ప్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో రూ.267 కోట్లతో 18 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18వ తేదీన దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది.

ఈ డాక్యుమెంట్ల ప్రకారం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ఒక్కో ఎకరానికి రూ.5.56 కోట్లు చెల్లించింది. అదేవిధంగా ఆధునిక డేటా సెంటర్ల ఏర్పా టు కోసం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో రూ.275 కోట్లతో భూమిని కొనుగోలు చేసింది.

Tags

Next Story