EC Notices : మంత్రి కొండా సురేఖకు ఈసీ నోటీసులు
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది.
కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 1వ తేదీన వరంగల్‌లో మాట్లాడిన కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. కేటీఆర్ ప్రమేయం ఉందంటూ కీలక ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, అధికారులను బదిలీ చేశారని, అనేకమందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారని ఆరోపించారు.
దీంతో సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు సురేఖ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com