TG : తారామతి బారాదరికి త్వరలోనే మహర్దశ

TG : తారామతి బారాదరికి త్వరలోనే మహర్దశ

హరిత తారామతి బారదారి రిసార్ట్ లో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) ఆకస్మిక తనిఖీలు చేశారు. హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. రిసార్ట్ అంతా కలియతిరిగారు మంత్రి జూపల్లి. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్ట్రారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమింగ్ ఫూల్, టాయిలెట్స్ ను పరిశీలించారు. హరిత రిసార్ట్ నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాడి మరమ్మతులు చేపట్టాలని, చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు? వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? అని ఆరా తీశారు. హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదనీ.. దీనికి నిర్వహణ లోపమే ప్రధాన కారణమన్నారు. ఆదాయం సరిగా లేదనీ.. గతంలోపట్టించుకునే వారే లేరనీ.. వివిధ స్థాయిల్లో సరైన నిర్ణయాలు తీసుకొని కారణంగా పర్యాటక శాఖ పరిధిలోని హరిత హోటల్స్ నిర్వహణ లోపభూష్టంగా తయారైందన్నారు.

ఎన్నికల కోడ్ కారణంగా పర్యాటక, ఎక్సైజ్ , సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపోయామనీ.. ఇప్పటినుంచి ప్రతీ నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు జూపల్లి. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి పెడతాం. ఆహ్లాదకరమైన వాతారవణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దుతామన్నారు. మూడు, నాలుగు నెలల్లో వాటి రూపురేఖలను మారుస్తామని వివరించారు. భవిష్యత్ లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags

Next Story