TG : కేసీఆర్ అంటే నాకు ప్రేమే : మంత్రి పొంగులేటి

TG : కేసీఆర్ అంటే నాకు ప్రేమే : మంత్రి పొంగులేటి
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే తనకు ప్రేమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ పథకాలపై తాము భేషజాలకు పోవడం లేదన్న మంత్రి అందులో మంచివి తీసుకొని, సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నామని మీడియాతో ఇష్టాగోష్ఠిలో స్పష్టం చేశారు. పొంగులేటి గతంలో బీఆర్ఎస్ లో పని చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఇందిరమ్మ ఇళ్ల నమూనాలపై అధ్యయనానికి తమ బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని అన్నారు. ఆ నివేదికలు రాగానే ఏడాదికి 4.50 లక్షల చొప్పున ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. అటు రాజీవ్ స్వగృహ టవర్స్ ధరలపై కమిటీ నివేదిక అనంతరం వేలం వేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే రేషన్ కు, వైద్యచికిత్సకు వేర్వేరు కార్డులు అందిస్తామని తెలిపారు.

Tags

Next Story