TG : కాసేపట్లో మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్.. బ్యారేజీల రిపేర్ల పనులు పరిశీలిన

కాసేపట్లో సుందిళ్ల బ్యారేజ్ దగ్గరకు చేరుకోనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ సుందిళ్ల, అన్నారం,మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ల పనులు పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సుందిళ్లకు బయలుదేరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాకాలం వస్తుండడంతో వీలైనంత త్వరగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు రిపేర్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బ్యారేజీల దగ్గర జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్, అధికారుల బృందం పరిశీలించనుంది. పర్యటనలో భాగంగా మొదట సుందిళ్ల బ్యారేజీ తర్వాత అన్నారం బ్యారేజ్ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి పనుల పురోగతిపై సమీక్ష చేస్తారు. అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు ఉత్తమ్.
పర్యటనలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ENC లు అనిల్ కుమార్, నాగేందర్ రావు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. బ్యారేజీల నిర్మాణాలను చేపట్టిన ఎల్అండ్ టీ, నవయుగ, ఆఫ్కాన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com