Excess Phone Usage : ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటి నుంచి పారిపోయిన మైనర్ బాలిక

Excess Phone Usage : ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటి నుంచి పారిపోయిన మైనర్ బాలిక

ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడకూడదని కుటుంబసభ్యులు ఆంక్షలు పెట్టడంతో 13 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. ఏప్రిల్ 9, మంగళవారం ఉదయం, ఆమె సోదరుడు, తల్లి ఫోన్‌లో ఎక్కువ మాట్లాడకుండా ఆంక్షలు పెట్టడంతో, మైనర్ బాలిక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది.

ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి యువతి ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా ఆ బాలికను గుర్తించారు. ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags

Next Story