TS : మిషన్ గాంజా.. తెలంగాణలో ఇకనుంచి డ్రగ్ డ్రైవ్‌ టెస్ట్‌లు

TS : మిషన్ గాంజా.. తెలంగాణలో ఇకనుంచి డ్రగ్ డ్రైవ్‌ టెస్ట్‌లు

హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారన్నది తెలిసిందే. తప్పతాగి బండ్లు నడిపేవాళ్లు ప్రమాదాలకు కారణమవుతారన్న కారణంతో డ్రంకెన్ డ్రైవ్స్ లేకుండా చూస్తుంటారు పోలీసులు. అయితే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో డ్రగ్స్ విచ్చలవిడిగా సప్లై అవుతున్నాయి. దీంతో.. వాహనాల డ్రైవర్లు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల మత్తులో ఉన్నారన్నది కూడా తేల్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ 'డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్'లను ప్రవేశపెట్టింది. డ్రగ్స్ దుర్వినియోగదారులను గుర్తించేందుకు 'ఎబాన్ యూరిన్ కప్' యంత్రాన్ని ఉపయోగించి పరీక్షలు నిర్వహించబడతాయి. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో -TSNAB వాహనదారులలో మాదకద్రవ్యాల భయంకరమైన వ్యసనాన్ని అరికట్టడానికి కిట్‌ను సిద్ధం చేసింది. కిట్‌లను అన్ని పోలీసు స్టేషన్‌లకు పంపారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నాడు డోర్నకల్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్రరావు, సబ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌రావుతో కలిసి 'డ్రగ్ అండ్ డ్రైవ్' పరీక్షలు నిర్వహించారు.

టెస్ట్ కిట్ లో డౌట్ వస్తే అనుమానితుల యూరిన్ సాంపిల్ తీసుకుంటారు. డ్రగ్ డిటెక్ట్ డివైజ్ లో రెండు ఎరుపు గీతలు కనిపిస్తే, అది నెగటివ్ గా అన్నట్టు. ఒక లైన్ వస్తే పాజిటివ్. పాజిటివ్ వచ్చినవారిని వెంటనే అదుపులోకి తీసుకుని మిగతా టెస్ట్ లు చేస్తారు. సో బీ కేర్ ఫుల్.

Tags

Read MoreRead Less
Next Story