TG : ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌లో 33 మంది అభ్యర్థులను ఇప్పటివరకు ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,210, BRS అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,514 ఓట్లు వచ్చాయి. గెలుపు కోసం 1,55,095 ఓట్లు అవసరం కాగా.. మల్లన్నకు 31,885, రాకేశ్‌కు 50,581 ఓట్లు కావాలి. కౌంటింగ్ ఆలస్యం అవుతుండడంతో మరో మూడు టేబుల్స్ ఏర్పాటు చేశారు సిబ్బంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ స్పీడ్ కానుంది. మధ్యాహ్నంలోపే తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2021 ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డికి, మల్లన్నకు మధ్య గట్టి పోటీ జరిగింది. కోదండరామ్‌కు పోలైన ఓట్లలో రెండో ప్రయారిటీ ఓట్లను మల్లన్నకు బదిలీ చేసినా పల్లా రాజేశ్వరెడ్డిని చేరుకోలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో మల్లన్నకు 1.22 లక్షల ఓట్లు వచ్చినందున, రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్నను చేరుకోవడం రాకేశ్ రెడ్డికి అంత సులువు కాదు. కాబట్టి గెలుపు మల్లన్నదే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com