TS : ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha) మూడురోజుల ఈడీ కస్టడీ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమెను గత మూడురోజుల పాటు ఈడీ రెండోసారి ఇంటరాగేషన్ లో ప్రశ్నించింది. అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై అభియోగాలు మనీలాండరింగ్ కిందకు రావని.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదన్నారు కవిత. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసని పంచ్ డైలాగ్ విసిరారు. లిక్కర్ స్కామ్ కేసు నుండి నిర్దోషిగా బయట పడతానని కవిత చెప్పడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆశలు పెంచింది.
కేసులతో కేంద్రం భయపెడుతోందని.. వారికి టికెట్లు ఇవ్వడమో.. పార్టీ ఫండ్లు రాబట్టుకోవడమో చేస్తోందని మండిపడ్డారు కవిత. కేసు నుండి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత చెప్పారు. అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com