Good News : పండుగ లాంటి వార్త.. త్వరలో 24 గంటల పాటు MMTS ట్రెయిన్స్
సిటీలో మెట్రోకు.. సిటీ శివారులో ఎంఎంటీఎస్ కు (MMTS) ఉన్న డిమాండ్ వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటిలో ఛార్జీలు తక్కువ.. వేగం ఎక్కువ ఉండటం వీటిలో అతిపెద్ద అడ్వాంటేజ్. అయితే అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లను నడపకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్‌గా మిగిలింది. ఈ మైనస్‌ను కూడా తొలగించే దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాన్ చే్తోంది. అంటే ఇక ఎంఎంటీఎస్‌లు మనకు రోజూ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి రాత్రి 10.30 వరకు మాత్రమే ఎంఎంటీఎస్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇక నుంచి ఆ బాధలు తప్పే అవకాశం ఉంది.
వందే భారత్ రైళ్లకు.. ఎంఎంటీఎస్ లకు లింక్ చేస్తూ రన్నింగ్ వేళలు మార్చుతున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల వేళలకు అనుగుణంగా MMTS Trainను అందుబాటులోకి తెచ్చే దిశగా రైల్వే అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, బెంగళూరు నుంచి నగరానికి వచ్చే వందేభారత్ ట్రైన్లన్నీ రాత్రి 11 గంటల తర్వాతే వస్తున్నాయని.. అప్పుడు నగరంలో ప్రజారవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ టైంలోనూ ఎంఎంటీఎస్‌లను నడపాలని ఆలోచిస్తున్నారట. ఉదయం 4 గంటల నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా, హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్‌లు నడిచేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ అంశంపైనా సౌత్ సెంట్రల్ రైల్వే సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com